ప్రజా గొంతుక న్యూస్ షేక్ షాకిర్ నల్లగొండ
ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్మికోద్యమ నాయకులు కామ్రేడ్ తిరందాసు గోపి స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులపై చేస్తున్న దాడికి వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చినపాక లక్ష్మీనారాయణ, తుమ్మల వీరారెడ్డిలు పిలుపునిచ్చారు.
బుధవారం స్థానిక దొడ్డి కొమురయ్య భవన్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ తిరందాసు గోపి7వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రమటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన అనేక కార్మిక సమ్మె పోరాటాలలో ముఖ్యమైన పాత్ర నిర్వహించిన గొప్ప కార్మిక నాయకుడు తిరందాసు గోపి అని కొనియాడారు. కార్మిక చట్టాలను సాధారణ కార్మికులకు వివరించి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడంలో చురుకుగా వ్యవహరించారని అన్నారు.ఆయన లేని లోటు ఉమ్మడి నల్గొండ జిల్లా కార్మికోద్యమానికి తీరనిలోటని అన్నారు.
నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని విమర్శించారు.ప్రజల రెక్కల కష్టంతో పెరిగి పెద్దవైన ప్రభుత్వ రంగ సంస్థలను అంగట్లో సర్కులాగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వర్గాన్ని చీలికలు పేలికలు చేయడానికి కుల మత ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతూ భావిద్వేగాలతో రాజకీయాలు చేస్తుందని వీటికి వ్యతిరేకంగా గోపి స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని గద్దెదించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని 73 షెడ్యూల్ పరిశ్రమల్లో విడుదల చేసిన కనీస వేతనాలు జీవోలను సవరించాలని కోరారు
ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండా శ్రీశైలం, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, సిఐటియు జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణ చారి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండం పెళ్లి సత్తయ్య, నవతెలంగాణ జిల్లా ఇంచార్జ్ పుప్పాల మట్టయ్య, సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, అద్దంకి నరసింహ,సలివొజు సైదాచారి,అవురేషు మారయ్య,పల్లె నగేష్, దాసోజు ప్రభుచారి తదితరులు పాల్గొన్నారు

