Monday, March 2, 2026

హుడా కాలనీలో వందమంది పేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ:

హుడా కాలనీలో వందమంది పేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ:

పేద ప్రజలను ఆదుకునే ఆపద్బాంధవుడు


సామాజిక సేవ సంస్కర్త తీగల శివకుమార్ ముదిరాజ్

మన సాక్షి గొంతుక :రంగా రెడ్డి జిల్లా బ్యూరో

శంషాబాద్ పరిధిలోని హుడా కాలనీలో ని ఎవరైన ఆపదలో ఉన్నరని తెలిస్తే వెంటనే స్పందించి తన వంతుగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని సామాజిక సేవా సంఘ సంస్కర్త తీగల.శివకుమార్ ముదిరాజ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే… శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి హుడా కాలనీలో నివసించే 100 మంది పేద మైనారిటీ కుటుంబాలకు ప్రతి సంవత్సరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని 25 కిలోల బియ్యం, నిత్యవసర వస్తువులను సామాజిక సేవ సంఘ సంస్కర్త తీగల శివకుమార్ ముదిరాజ్, సిద్దేశ్వర దేవాలయం ట్రస్ట్ చైర్మన్ మడపతి నరేందర్ తోకలిసి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బియ్యం,నూనె,నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ ఆదుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. హుదా
కాలనీతోపాటు కొత్తూరు జహంగీర్ పీర్ దర్గాలో 30,మంది మత పెద్దలకు, 40 మంది సిబ్బందికి రంజాన్,పర్వదినని పురస్కరించుకొని నిత్యవసర సరుకులు,పంపిణీ చేశామన్నారు. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలోని హుడా కాలనీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా
నేనున్నానంటూ ముందుండి శివకుమార్ ముదిరాజ్ తన సహాయ,సహకారాలు
అందిస్తున్నారు. కాలనీలో నిరుపేద కుటుంబాల,పెళ్లీడు,కూతుర్లకు,సహాయం,ఎవరైనా రోడ్డు,ప్రమాదాలకు గురైన వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అయితే గతంలో కాలనీ,వాసులకు ఒక దేవాలయం లేకపోవడంతో తన సొంత నిధులతో మూడు నూతన దేవాలయాలు,మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ లను తీగల శివకుమార్ గ్రామస్తుల కోసం నిర్మించారు. దేవాలయాల,నిర్మాణంతో పాటు నిరుపేద ముస్లింలకు ప్రతి సంవత్సరం రంజాన్ కానుకగా నిత్యవసర సరుకులు,పంపిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. అంతే కాకుండా ప్రతి సంవత్సరం బోనాల పండుగాకు,సంబంధించిన ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలించడంతో గ్రామస్తులు శివకుమార్ కు కృతజ్ఞతలు
తెలిపారు. కాలనీలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం 5 నుండి 10 వేల,రూపాయలు,ప్రమాదంలో బారిన పడి హాస్పిటల్ లో చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న,వారికి వైద్య ఖర్చులు కూడా అందజేస్తున్నారని తెలిపారు. హుడా కాలనీ ప్రజలను తన కంటికి,రెప్పలా కాపాడుకుంటూ వారిలో ఒకరిగా శివకుమార్ ముదిరాజ్ సేవ చేయడం ఎంతో గొప్ప,విషయం అన్నారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ… తాను కూడా ఎంతో కిందిస్థాయి నుండి,ఈ స్థాయికి చేరుకున్నానని పేద ప్రజల కష్టాలను దగ్గర నుండి చూసిన వాడిని కాబట్టి కాలనీలో
ఎవరికి ఆపద వచ్చిన తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. హుదా,కాలనీలో ఎవరికి ఏ కష్టం వచ్చిన తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి,ఇబ్బందులు కలిగిన తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో, ఇర్ఫాన్ ఖాన్,రమేష్, తీగల సాయి ముదిరాజ్, మీసేవ భాస్కర్, వినయ్, బాబా, అజీమ్, సలీం,సాదిక్, రఫిక్, సర్దార్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular