మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
అందించిన సామాజికవేత్త నల్లనాగుల వెంకట చారి
సామాజికవేత్త నల్లనాగుల వెంకట చారి

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
గత కొన్ని సంవత్సరాలుగా పలు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నసామాజికవేత్త నల్లనాగుల వెంకట చారి ఈరోజు మరో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం ,కట్కూరు గ్రామానికి చెందిన గుజ్జుల కనకయ్య ఆకస్మిక మరణం చెందడం జరిగింది. వారి కుటుంబానికి సామాజికవేత్త నల్లనాగుల వెంకట చారి సహకారంతో కట్కూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడగకుండానే సహాయం అందించిన నల్లనాగుల వెంకట చారి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పుట్ట నరసింహులు, కార్యకర్తలు బొజ్జ వెంకటేష్ ,గొడుగు కమలాకర్, బోయ సతీష్, బోయ వెంకటేష్, బోయ ప్రవీణ్ ,బోయ బాల నరసయ్య మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.

