మత సామరస్యానికి ప్రతీక రంజాన్
— జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని నెలరోజులు ఉపవాస దీక్షలు చేపట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటారని జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా జనగామ పట్టణంలోని సిద్దిపేట్ రోడ్ లో గల ఈద్గాలో జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి విచ్చేసి ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.పండుగలు మన ఐక్యతకు నిదర్శంగా నిలుస్తాయని రంజాన్ ప్రతి ఇంట సుఖ సంతోషాలను కలిగించాలని ఆ అల్లాను వేడుకున్నట్లు తెలిపారు. జనగామ నియోజక వర్గ ముస్లిం సోదర సోదరీ మణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

