బచ్చన్నపేట చౌరస్తాలో చలివేంద్రం ప్రారంభం

మన సాక్షి గొంతుక ప్రతినిధి /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండల కేంద్రంలో జిల్లా నారాయణ , విజయమ్మ కుమారుడు జిల్లా హరి కిషన్ శ్రీనివాసులు వారి, తండ్రి జిల్లా నారాయణ జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బచ్చన్నపేట ఎంపిటిసిలు రాధా ఎల్లయ్య, పుష్ప బాలకిషన్, పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్ లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా నారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు హరి కిషన్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఎండాకాలం ప్రజలకు చల్లటి నీరు అందించాలని సంకల్పంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇంకా వారి పేరు మీద మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారి కుమారుడు హరికిషన్ మాట్లాడుతూ, బచ్చన్నపేట మండలంలో మా నాన్నగారి పేరుమీద చలివేంద్రం ఏర్పాటు చేయడం నాకెంతో సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని తెలియజేశారు.ఈ సందర్భంగా మోహన్ రెడ్డి, శ్రీను, దాచేపల్లి రాజయ్య, దాచేపల్లి అశోక్ ,ఎద్దు నాగయ్య ,రాజు, గాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

