వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య…?

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ వరంగల్
సారత్విక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. గతంలో వరంగల్ పార్లమెంటుకు కడియం కావ్యాను ప్రకటించగా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు .తాజాగ బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ శుక్రవారం వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను ప్రకటించబోతున్నారని సమాచారం. అయితే ఇంతకుముందు బి ఆర్ ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యం ఎంపిక చేయగా, తాను బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయలేనని ప్రకటించి, అనూహ్యంగా తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ టికెట్ దక్కించుకుంది. ఎన్నో తర్జనభర్జనల అనంతరం స్టేషన్గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వరంగల్ బి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఎంపిక , చేస్తారా లేదా అనేది తెలియాలి

