ప్రజా గొంతుక : రంగారెడ్డి జిల్లా బ్యూరో,ఆర్ ఆర్ గౌడ్
కేటుగాళ్లు మోసాల్లో కొత్త
పంథాలు ఎంచుకుంటున్నారు. మార్కెట్లో,డిమాండ్ ఉన్న వాటికి నకిలీ తయారు చేసి
సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్
శంషాబాద్ లో నకిలీ సాస్ తాయారు చేస్తున్న
ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ప్రాణాంతకమైన రసాయనాలతో ఓ ముఠా సాస్
ను తయారు చేస్తోందన్న సమాచారంతో దాడులు
నిర్వహించారు. హానికర రసాయనాలు, సింథటిక్
రంగులతో సాస్ ను ఈ ముఠా తయారు చేస్తోంది.772 లీటర్ల కల్తీ సాస్, 30 లీటర్ల ఎసిటిక్ ఆసిడ్,ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ బాలాజీ ఇండస్ట్రీపై దాడి చేసి రూ.3.50 లక్షలు,విలువ చేసే కల్తీ సాస్ ను శంషాబాద్ ఎస్వోటీ
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

