కరెంట్ ఎందుకు పోతుందో ఎప్పుడొస్తుందో

ఊడకపోతలో గోపాల్ నగర్ గ్రామ ప్రజలు
మన సాక్షి గొంతుక ప్రతినిధి /బచ్చన్నపేట మండలం
ఎండలు మండి కరెంటు లేక ఉడకపోతతో ప్రజలు బచ్చన్నపేట మండల గోపాల్ నగర్ గ్రామంలో ఇబ్బందులకు గురవుతున్నారు .జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో గత రెండు రోజుల నుండి కరెంటు గంటల కొద్ది పోవడం మరి ఎప్పుడు వస్తుంది తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. కరెంటు ఎందుకు పోతుంది ఏ రోజు కరెంటు రాదు అనే విషయాన్ని పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేసే వారు, కానీ ఇప్పుడు ప్రజలకు ఎలాంటి సమాచారం తెలియజేయడం లేదు. మరి ఎందుకు కరెంటు పోతుంది , ఎక్కడైనా మరమ్మతులు చేపట్టారా లేక ఏ ప్రాబ్లం ఉన్న విషయం ప్రజలకు తెలియజేయలేకపోతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

