భువనగిరి పార్లమెంట్ ఓబీసీ సెల్ ఇన్చార్జిగా లొక్కుంట్ల ప్రవీణ్ నియామకం

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ జనగామ
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి పార్లమెంటుకు ఓబీసీ సెల్ నుంచి ఇన్చార్జిలను నియమిస్తూ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ నుతి శ్రీకాంత్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.భువనగిరి పార్లమెంట్ ఓబీసీ సెల్ ఇన్చార్జిగా జనగామ జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ లోకుంట్లా ప్రవీణ్ ను నియమించడం జరిగింది.నియామక పత్రాలు అందుకున్న అనంతరం భువనగిరి పార్లమెంట్ ఓబీసీ సెల్ ఇంచార్జ్ లోకూంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ ఓ బి సి సెల్ ఇన్చార్జిగా నాకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి కి మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ , మరియు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి ఓబీసీ సెల్ తరుపున పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి. పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడంలో బీసీల పాత్ర ఎక్కువగా ఉంటుందని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బీసీల అందరు మద్దతు తెలిపి ఐదు లక్షల మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామని తెలిపారు

