అగ్ని ప్రమాదానికి గురి అయ్యి సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వము ఆదుకోవాలి
*చర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ని నిర్మించాలి కనీసం వేసవికాలం వరకైనా ఒక ఫైర్ ఇంజన్ ని కేటాయించాలి

చర్ల, ఏప్రిల్ 16, మన సాక్షి గొంతుక:
చర్ల మండలం లింగాపురం గ్రామంలో సోమవారం రాత్రి మెడబతిని నరసింహారావు ,చందు అనే రైతుల గుడిసెలు అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయి మొత్తం దగ్ధం అయ్యీ సర్వం కోల్పోయిన భాదిత కుటుంబాలను cpiml మాస్ లైన్ పార్టీ నాయకత్వం పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా చర్ల మాస్ లైన్ పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతు వేసవికాలం వచ్చిన ప్రతిసారి చర్ల మండలంలో గడ్డి గుడిసెల్లో నివసించే పేదలు ఎప్పుడు ఏ అగ్ని ప్రమాదం సంభవిస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతారని అన్నారు.వేసవిలో ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో ఇక్కడ ఇల్లు తగలబడి ఆ కుటుంబాల రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారూ. అందులో భాగంగానే చర్ల మండలంలోని లింగాపురం గ్రామంలో సోమవారం రాత్రి 8 గంటల సమయం లో రెండు గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయని ఈ రెండు గుడిసెల కుటుంబాలు కూడా సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి తక్షణ రక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జరిగిన నష్టాన్ని గుర్తించి బాదిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని తద్వారా వారిని ఆదుకోవాలని కోరారు. పెద్దమనసుతో గ్రామస్తులు పెద్దలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రముఖులు కులసంఘాలు ఇతర రాజకీయపార్టీల నాయకులైన వారందరూ బాధిత కుటుంబాలను తోచిన సహకారంతో అందించి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. చర్లలో ఫైర్ స్టేషన్ నిర్మించి ఉంటే లేదా వేసవికాలం వరకైనా ఒక ఫైర్ ఇంజన్ కేటాయించబడి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని కొంతమేరకైనా ప్రమాదాల నివారించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ని నిర్మించాలని నడిపించాలని కోరుతున్న అధికారులు పట్టించుకోకపోవడం ఎంత దుర్మార్గం అని ప్రశ్నించారు. కళ్ళ ఎదుట అగ్ని ప్రమాదానికి గురై ప్రజలు రోడ్డున పడుతున్న ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ఫైర్ స్టేషన్ ని లేదా ఫైర్ ఇంజన్ ని చర్ల మండల కేంద్రంలో కేటాయించాలని అన్నారు.లేని ఎడల తప్పకుండా పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.

