ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగపురి కిరణ్ కుమార్.

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ జనగామ
ఇటీవలే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేసిన జనగామ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు అధికారికంగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భముగా రాబోయే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని, నియోజకవర్గంలోని నాయకులు అందరినీ కలుపుకొని చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. జాయినింగ్ కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే,ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రావత్ అనిల్, మాజీ ఎమ్మెల్సీ రాజేశం,కెకె మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

