మండుతున్న ఎండల్లో చల్లటి మజ్జిగ అందిస్తున్న జర్నలిస్ట్

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ జనగామ
మండుతున్న ఎండల్లో చల్లటి మజ్జిగ అందిస్తున్న జర్నలిస్ట్ చెన్నూరి మహిపాల్ ఆదర్శంగా నిలిచారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మండలానికి వచ్చే ప్రజలకు దాహార్తి తీర్చాలని సంకల్పంతో తన వంతుగా ఉచితం మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవ చేయడమే అసలైన సంతృప్తి అని నా వంతుగా ప్రజలకు ఉచితం మజ్జిగ అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు అతనిని అభినందించారు.

