అంగన్వాడీ సెంటర్లలో గ్రాడ్యుయేషన్ డే

ప్రజా గొంతుక న్యూస్/ షేక్ షాకీర్/ నాగార్జున సాగర్ నియోజక వర్గం
నల్లగొండ జిల్లా అనుముల మండలం అనుముల ప్రాజెక్టు హాలియా సెక్టార్ పరిధిలోని పేరూరు,హలియ.4 అంగన్వాడి సెంటర్ పరిధిలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా,ఏసిడిపిఓ సువర్ణ,సూపర్వైజర్ రమాదేవి,మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు బాల్యారాంబదశ విద్య ప్రోగ్రెస్స్ కార్డు ప్రాముఖ్యత పిల్లల పేరెంట్స్ కు వివరించడం జరిగింది పూర్వ ప్రాథమిక విద్యా ద్వారా శారీరక సాంఘిక,మానసిక, భాషా, భావోద్వేగాభివృద్ధి,మేధో వికాసం జరుగుతుంది , ఈ బాల్యారంభవిద్య ద్వారా పిల్లల్లో అభివృద్ధి నైపుణ్యాలు గుర్తించి వారికి ప్రతి మూడు నెలలకు ఒకసారి అభివృద్ధినీ పరిశీలించి స్టార్స్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలు నేర్చుకున్న నైపుణ్యాలను పేరెంట్స్ ముందు ప్రదర్శించడం జరుగుతుంది,పిల్లలకు మంచి అలవాట్లు,బడి మానివేతను తగ్గించడం, పూర్వ ప్రాథమిక విద్య ద్వారా పిల్లలకు నేర్పించడం జరుగుతుంది,తదుపరి పిల్లల యొక్క బరువు ఎత్తు తీసి వాళ్ల పోషణ స్థాయిని గ్రోత్ కార్డులలో చూపించి తల్లులకు వివరించడం జరిగింది,ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ వనజకుమారి,విజయ లక్ష్మి,మంగమ్మ,సోనిబేగం,పిల్లల పేరెంట్స్ పాల్గొనడం జరిగింది

