Monday, March 2, 2026

కిసాన్ కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇంచార్జిగా నిడిగొండ శ్రీనివాస్

కిసాన్ కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇంచార్జిగా నిడిగొండ శ్రీనివాస్


మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం

ఆల్ ఇండియా కాంగ్రెస్‌కమిటీ
కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అఖిలేష్ శుక్ల ఆదేశాల మేరకు
తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ,వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ లు కిసాన్ కాంగ్రెస్ , తెలంగాణ రాష్ట్ర పార్లమెంటుల ఇంచార్జ్లను నియమించారు .జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, కట్కూరు గ్రామానికి చెందిన నిడిగొండ శ్రీనివాస్ గతంలో కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ గా పార్టీకి సేవలందిస్తూ, ప్రతీనిత్యం ప్రజాసేవలో ఉండడం వల్ల తన సేవలను గుర్తించి మెదక్ పార్లమెంట్ కిసాన్ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా నిలబడిన నీలం మధు నీ భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని, గ్రామ గ్రామాన ఇంటింటికి తిరిగి ప్రచారం , నిర్వహించినట్లు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన చైర్మన్ సుంకటి అన్వేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .అదేవిధంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మదుకు జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాపరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ ఎవరినైనా పార్టీ గుర్తిస్తుందని దానికి నేనే ఉదాహరణ అని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ , ప్రభుత్వంలో రైతును రాజును చేయడం లక్ష్యమని ,అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు నేరుగా అందజేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular