*తుమ్మలపై దాడి చేయాలనుకోవడం దుర్మార్గపు చర్య*
•కుట్ర దారులకు కఠిన శిక్షలు విధించాలి
•రాం రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు,చల్ల నరసింహారావు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జగన్మోహన్
మంగీలాల్ చౌవాన్ కాంగ్రెస్ పార్టీ యువజన , నాయకులు
మన సాక్షి గొంతుక :తెలంగాణ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద దాడి చేసే పన్నాగాన్ని ఖండిస్తున్నామని ఖమ్మం కాంగ్రెస్ యువజన నాయకులు, మంగీలాల్ చౌవాన్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేయాలనుకోవడం అమానుషం అని తెలిపారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. తుమ్మలపై జరిగిన కుట్టను ఖండిస్తున్నామని, భౌతిక దాడులకు పాల్పడాలనుకోవడం దారుణమని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని శాంతి సామరస్యాలతో ప్రజలు కలిసిమెలిసి ఉండేవారని ఇటువంటి జిల్లాలో కుట్ర దారులు ఎంత పెద్ద వారైనా చర్యలు తీసుకోవాలని, దోషలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులను నడిరోడ్డు మీద ఉరితీయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ న్యాయం చేసే మనిషి తుమ్మల అని, ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి కాదని అటువంటి వారిపై దాడి చేయాలనుకోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ఉన్నత స్థానంలో ఉండి ప్రజలకు ప్రాణాలు పోసి న్యాయం చేసే డాక్టర్, పోలీసు అధికారులు ఈ కుట్ర లో పాలుపంచుకోవడం దారుణమని దీనిని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని ఖమ్మం సి.పి. కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా నాయకులు సూర్య కుమార్, చరణ్, రామ్ రెడ్డి భూక్య నవీన్ పోలూరి రమేష్, జిల్లా నాయకులు గుర్రం సత్యనారాయణ, రఘునాధపాలెం మండల నాయకులు రాము నాయక్ కోటేష్ నాయక్ నరసింహ,హరి సింగ్ నాయక్( పంగిడి) దేవ్ సింగ్ నాయక్ రామ్మూర్తి, దిప్లా నాయక్ తుమ్మలపల్లి నరసింహారావు భూక్య సునెస్, చిన్న ( ఎన్వి బంజారా) తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ యువజన నాయకులు చౌహాన్ తెలియజేశారు.కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాం రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు,చల్ల నరసింహారావు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జగన్మోహన్ యువజన కాంగ్రెస్ నాయకులు మంగీలా చౌహన్ అన్నారు.