కడుపులో గడ్డ(కంతి) ఇంటినిండా పేదరికం
తల్లి చనిపోయింది తండ్రి ఆటో డ్రైవర్
దాతల కోసం ఎదురుచూపులు…!
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ఓ యువతి కడుపులో గడ్డ(కంతి) ఆపరేషన్ చేసుకుందామంటే డబ్బులు లేవు ఇంటినిండా పెద్దరికం. వివరాలు ఇలా ఉన్నాయి. షేక్ ఫాజిల్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అతనికి ముగ్గురు ఆడపిల్లలు. ఇతని భార్య చనిపోయి ఎనిమిది నెలలు అవుతుంది.పెద్ద బిడ్డకు , సంవత్సరం క్రితం కడుపులో గడ్డ(కంతి)రావడం వల్ల సర్జరీ అయింది, ఖర్చు రెండు లక్షల యాబై వేలు అయింది, ఆరున్నర కిలోల గడ్డ(కంతి )కడుపులో నుండి తీసివేశారు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత అదే సమస్య. మళ్ళీ కడుపులో గడ్డ(కంతి)పెరగడం మొదలైంది. ఇప్పుడు పాప సర్జరీ కోసం మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు పాపకు సర్జరీ చేయించేంత ఆర్థిక స్తోమత లేదు.
ఈ పాప ప్రాణాలు కాపాడడానికి దాతలు ఎవరైనా కరుణించి సహాయం అందించాలని,
మీరు దయచేసి మా కుటుంబ ఆర్ధిక స్థితిని అలాగే పాప ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని మీకు తోచినంత ఆర్థిక సహాయం చేయగలరని మీడియా ద్వారా వేడుకున్నారు.
దాతలు పంపించవలసిన ఫోన్ పే నెంబర్
7287082239