ఆడబిడ్డల వివాహాలకు కానుకలు అందించిన కోడూరు శివకుమార్ గౌడ్
పేదింటి పెళ్లిళ్లకు పెద్దన్న లాగా ఆదుకుంటున్న
కోడూరు శివకుమార్ గౌడ్

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
గత కొన్ని సంవత్సరాలుగా కొన్నే గ్రామంలో నిరుపేద కుటుంబాలను , ఆదుకుంటూ అండగా నిలుస్తూ, ఆర్థిక సహాయం అందిస్తూ, కానుకలు అందిస్తున్న కోడూరు శివకుమార్ గౌడ్ మరో ఇద్దరు ఆడ, బిడ్డల వివాహాలకు తన వంతు, సహాయంగా ఆర్థిక సహాయం అందించారు. జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, కొన్నే గ్రామంలో పిట్టల ఇస్తారి శ్యామల కూతురు వివాహానికి మరియు గొల్లపల్లి రాజమణి బాలయ్య కూతుర్ల వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన కోడూరుశివకుమార్ గౌడ్ కానుకలు అందించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అడగకుండానే కానుకగా ఆర్థిక సహాయం అందించిన శివకుమార్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో పట్నం శట్టి భద్రయ్య పశుల సూరి పశుల కమలాకర్ నాగపురి బిక్షపతి బాలరాజ్ యాట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

