Wednesday, March 4, 2026

తండ్రి మందలించాడని పురుగుల మందు త్రాగి యువకుడి ఆత్మహత్య

తండ్రి మందలించాడని పురుగుల మందు త్రాగి యువకుడి ఆత్మహత్య

మృతి చెందిన యువకుడి కండ్లు దానం చేసిన తల్లిదండ్రులు

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ జనగామ

తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ మండలం లోని పెంబర్తి గ్రామంలో జరిగింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెంబర్తి గ్రామానికి చెందిన రైతు గుండా శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు గుండా శ్రీకాంత్ కు తండ్రి కి మధ్య ఆదివారం గొడవ జరిగింది.దాంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ ఆదివారం సాయంత్రం భావి దగ్గరికెళ్ళి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం కు పాల్పడగా చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోస్టుమార్టం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరగా అంత్యక్రియలు పెంబర్తి గ్రామంలో జరుగుతున్నాయి. చేతికి అంది వచ్చిన కొడుకు మరణంతో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.మృతి చెందిన యువకుడి కండ్లు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తల్లిదండ్రులు, దానం చేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular