భారతదేశాన్ని ప్రపంచంలోనే సంపన్న దేశంగా చేయాలనే తపన ప్రధాని నరేంద్ర మోడీ

జిల్లా నాయకులు సద్ది సోమిరెడ్డి..

ప్రజా గొంతుక/బచ్చన్నపేటమండలం
భువనగిరి బిజెపి పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, గెలుపే లక్ష్యంగా, బచ్చన్నపేట మండల బిజెపి నాయకులు మండుటెండలో సైతం ప్రచారం నిర్వహించారు
బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో బిజెపి భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా నాయకులు సద్ది సోమిరెడ్డి ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. వారు మాట్లాడుతూ 10 ఏళ్ల మోడీ పాలనలో దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉందని అందుకు మరోసారి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేశ అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు మోడీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. అలాగే ఈసారి కూడా భువనగిరి పార్లమెంట్ స్థానంలో బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలిపిస్తే మన జనగామ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామాలకు నిధులు వస్తున్నాయని అన్నారు. నరేంద్ర మోడీ కృషితోనే జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రపంచ దేశాలు కూడా భారతదేశ పై నరేంద్ర మోడీ పాలనన మీద హర్షం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ గద్దరాజు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జంజాల సురేష్, మండల నాయకులు గడ్దోజు రవీంద్ర చారి, గద్ద శ్రీకాంత్, ప్రవీణ్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

