Wednesday, March 4, 2026

విద్యార్థులకు ఘనంగా సన్మానం

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సీ 10 జి పీ ఏ, ఇంటర్మీడియట్ లో ద్వితీయ సంవత్సరం లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ఘనంగా సన్మానం

మన సాక్షి గొంతుక మే 2 ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ

దేవరకొండ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సీ ఫలితాలలో 10 జి పీ ఏ సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన వారికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ తిమ్మాపురం చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్, స్థానిక కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి పాల్గొని అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థిని, విద్యార్థులను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వెనకబడ్డ ప్రాంతంలో మధ్యతరగతి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి సాధారణ మైనటువంటి స్కూల్లో కళాశాలలో చదివి రాష్ట్రస్థాయిలో అత్యున్నత ప్రతిభ కనపరచడం గర్వకారణం అని కొనియాడారు.ముందు ముందు అనేక ఉన్నత చదువులు చదివి సమాజానికి,సంఘానికి, సమాజ శ్రేయస్సుకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి సంఘానికి, సమాజానికి ప్రతిభావంతులుగా పేరుగాంచాలని కొనియాడారు. ఇంటర్మీడియట్ విద్యార్థిని, విద్యార్థులు సన్మానం పొందిన వారిలో టి. హఫసా తబస్సుమ్ 982/1000 ( బైపిసి), వి. శ్రీ వసుద 962/1000(ఎంపీసీ), కె. తనుశ్రీ 843/1000(ఎం ఈ సీ)భవిత కాలేజ్,పీ.పూజిత 975/1000(సి ఎస్సీ) ఏ. మేఘన 944/1000(ఎంపీసీ), టి. శ్రావణి 941/1000(హెచ్ ఈ సి), జి.శివాని 927/1000(ఓ ఏ) ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,10 జి పీ ఏ సన్మాన గ్రహీతలు ఏ. రిషిత(టి ఎస్ డబ్లూ ఆర్ ఎస్ జే జి) కొండమల్లేపల్లి, జి. మనస్విని, వేణు గుండబోయిన( ఎస్ పి ఆర్)దేవరకొండ, అయేషా సిద్ధిఖ,అయేషా అంజూమ్, పి.అక్షయ ( కృష్ణవేణి టాలెంట్ స్కూల్)దేవరకొండ,ఎన్. నక్షత్ర రాథోడ్ ( బ్రిలియంట్ )దేవరకొండ,కె.కావేరి, ఎన్. సోనియా, యం. సౌందర్య, ఎస్. స్పందన (టి టీ డబ్లు యు అర్ జే సి జి) సి ఓ ఈ దేవరకొండ, ఎన్. జీవన్ ( జడ్పీహెచ్ఎస్ స్కూల్ బాయ్స్ )దేవరకొండ, ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు చోల్లేటి భాస్కరాచారి, రాచమల్ల నాగయ్య, ఎన్ వి టి, కూరెళ్ళ కృష్ణమాచారి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం లింగయ్య, అంకం చంద్రమౌళి, యేకుల సురేష్, బుచ్చయ్య, ఇరగదిండ్ల కృష్ణ,కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సీ.రాజ్ కుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, కళాశాల మరియు పాఠశాల సిబ్బంది, పేరెంట్స్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular