కాంగ్రెస్ పార్టీలో చేరిన బొట్టు సుధాకర్.

మన సాక్షి గొంతుకప్రతినిధి/
బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో బిఆర్ఎస్ నాయకులు ఎస్ఎంసి మాజీ చైర్మన్ బొట్టు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, బచ్చన్నపేట మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం బొట్టు సుధాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని, పార్లమెంట్ ఎలక్షన్ లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల్లకిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో, నక్కవానిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బోడపట్ల ఐలయ్య, కొయ్యడ శీను, అమృత రెడ్డి, మాజీ సర్పంచ్ మాసాపేట రవీందర్ రెడ్డి, చింతల కర్ణాకర్, తదిత రులు పాల్గొన్నారు.

