గ్రామస్థాయిలో పుంజుకుంటున్న కాంగ్రెస్
కొన్నే గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాజీ ఎంపిటిసి అంబాలా ఆగయ్య
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం లో పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పుంజుకుంటుంది. బచ్చన్నపేట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ ,కొన్నే మాజీ సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుత్తి సిద్దిరాములు ఆధ్వర్యంలో కూరాం భాస్కర్, మాజీ ఎంపిటిసి అంబాలా ఆగయ్య, జవ్వాజి నర్సింహులు, చెవుల కుమారస్వామి, ఉప్పరి రఘపతి, గుండోజు సత్యనారాయణ, గుత్తి సంపత్ పాశికంటి,జనార్దన్, గునిగంటి నర్సింహులు, గొట్టే రవి, తమ్మలి బాలస్వామి, చల్ల కమలాకర్, పిట్టల కనకయ్య లతో పాటు 30 మంది కి జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మురి ప్రతాపరెడ్డి , కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ కండువా కప్పారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని, మండలం నుండి భారీ మెజార్టీ తో గెలుపుకు కృషి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడలే కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ చెవిటి ఆనందం, సీనియర్ నాయకులు ఇస్తారీ, నర్సింహా చారీ,శ్రీనివాస్రెడ్డి ,పిట్టల బాలరాజు, సంతోష్ రెడ్డి సందీప్, ఉప్పరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

