టిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్
కాంగ్రెస్ పార్టీలో చేరిన యువ నాయకుడు

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం చెందిన బిఆర్ఎస్ నాయకుడు ఐవిఎఫ్ జిల్లా యూత్ అధ్యక్షుడు సామాజికవేత్త జిల్లా సందీప్ జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి తనయుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితోపాటు గుర్రపు బాలరాజు ,జంగిటి సిద్ధులు, హరికృష్ణ, విజయభాస్కర్, వేముల భద్రయ్య, దేవరకొండ మల్లేష్, లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా యువ నాయకుడు జిల్లా సందీప్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి బాలకిషన్ గౌడ్, జంగిటివిద్యనాథ్ , దిడిగా రమేష్, మల్లవరం అరవింద్ రెడ్డి, ఎద్దు హరీష్, మహాత్మ చారి, దాచేపల్లి నర్సింగరావు, మాసాపేట రవీందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

