తపస్ పల్లి రిజర్వాయర్ నుండి నీళ్లు దోచుకుపోయింది కేసీఆర్ హరీష్ రావే...
దమ్ముంటే తపస్ పల్లి రిజర్వాయర్ వద్దకు పల్లా రావాలి
జీవో ప్రకారం నీళ్లను సిద్దిపేటకు గజ్వేల్ కి బంద్ చేపించాలి
చేర్యాల మార్కెట్ మాజీ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి

ప్రజా గొంతుక / బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వాక్యాలను చేర్యాల మార్కెట్ మాజీ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ నియోజకవర్గం , కరువు ప్రాంతంగా గుర్తించి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి రిజర్వేర్ల నిర్మాణం కోసం సొంత డబ్బులతో ప్లానింగ్ వేపించి రిజర్వేర్లను నిర్మించి నీటిని అందించారు. కెనాల్ కాల్వల ద్వారా చెరువులు నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీది అప్పటి ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిది అన్నారు. తపస్పల్లి రిజర్వాయర్ నుండి గత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాజీమంత్రి హరీష్ రావుకు సహకరించి నీటిని సిద్దిపేటకు తరలించి జనగామ నియోజకవర్గానికి అన్యాయం చేశారని తెలియజేశారు. తపస్పల్లి రిజర్వాయర్ నీటిని సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గ లకు ఇచ్చే జీవో లేకున్నా అధికార బలంతో తపాస్పల్లి రిజర్వాయర్ నీటిని తరలించి జనగామ నియోజకవర్గం లోని మండలాలకు అన్యాయం చేశారని అన్నారు. ఎలక్షన్ ముగిసిన తర్వాత రిజర్వ్ వద్దకు ఎమ్మెల్యే పల్లా వచ్చి జీవో ప్రకారం నీటిని విడుదల చేసే విధంగా సిద్దిపేట, గజ్వేల్ కి వెళ్లే నీటిని దమ్ముంటే బందు చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎలక్షన్ ముగిసిన తర్వాత చెప్పిన విధంగా ఎన్నో పథకాలు అందుబాటులోకి రాబోతున్నాయని, పేద ప్రజలకు ప్రతి సంక్షేమ పథకం చేరుతుందని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ప్రతి పథకం అమలు చేస్తుందన్నారు. జనగామ నియోజకవర్గం లోని ప్రజలు ఇట్టి విషయాన్ని గ్రహించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పిలుపునిచ్చారు. క్యామ మల్లేష్ కు డిపాజిట్ రాకుండా చేసి ,తెలంగాణ నుండి టిఆర్ఎస్ పార్టీని తరిమికొట్టాలని అన్నారు.

