ఎన్నికలు సమీపిస్తున్న వేళ
బచ్చన్నపేట మండల టిఆర్ఎస్ పార్టీకి మరో షాక్

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బచ్చన్నపేట , టిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బచ్చన్నపేట మండలం, కోడవటూరు గ్రామం నుండి ఎంపీటీసీ నీల శైలజ రమేష్ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు లక్ష్యంగా గ్రామంలో ప్రచారం నిర్వహించి మా గ్రామం నుండి మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ లోని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, అందుకే ఈరోజు పార్టీలో చేరడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ , గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లం శ్రీనివాస్, గంగం బుచ్చిరెడ్డి, నిమ్మ కరుణాకర్రెడ్డి ,గంగరబోయిన మహేందర్, దిడిగే రమేష్ , గుర్రపు బాలరాజు, మాసాపేట రవీందర్ రెడ్డి, హరిక్రిష్ణ పాల్గొన్నారు…

