పూటకో పార్టీని మార్చే వాళ్లకు ఎమ్మెల్యేను విమర్శించే హక్కు లేదు
వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
పూటకో పార్టీని మార్చే వాళ్లకు ఎమ్మెల్యేను విమర్శించే హక్కు లేదు అని బచ్చన్నపేట వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణపురం గ్రామానికి చెందిన నాయకుడు తన అవినీతి అక్రమాలు బయటపడతాయని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఇప్పుడు మళ్లీ పార్టీ మారి , తన ఉనికిని కాపాడుకోవడం కోసం విమర్శలు చేస్తున్నాడు. దమ్ముంటే నారాయణపురం బొడ్రాయి వద్దకు వచ్చి ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నాయకత్వంలో రానున్న రోజుల్లో జనగామ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు .చెప్పిన మాట ప్రకారం జనగామ నియోజకవర్గం నుండి వందల మంది ఆసుపత్రికి వస్తే ఉచిత వైద్యం అందించిన ఘనత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేశారు

