కాంగ్రెస్ కు జై కొట్టిన గౌడ నాయకులు

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం అలింపురం గ్రామంలో గౌడ కులానికి చెందిన ఎలికట్ట శ్రీరాములు, ఎలికట్టే యాదగిరి అంజయ్య, కుమారస్వామి ,జయ రాములు సత్తయ్య, బండి కమలమ్మ యాదగిరి సోమయ్య, బాబులు ఎలుకట్టే యాదగిరి ,దూడల సత్తయ్య పలువురు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులై ఎంపీటీసీ మొహమ్మద్ మసూద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి తనయుడు యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పాకాల కర్ణాకర్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ ఎలికట్టె సత్యనారాయణ ఎలికట్టే శాంతయ్య గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మంతపురి రాములు పాల్గొన్నారు.
కొన్నే, దబ్బకుంటపల్లి గ్రామం నుండి చేరికలు
కొన్నే, దబ్బకుంటపల్లి గ్రామాల నుండి సుమారు 30 మంది టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి, కొన్నే మాజీ సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు, వీరికి డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని, చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషిచేస్తామని తెలిపారు. కొన్నే గ్రామం నుండి వంచ కృష్ణా రెడ్డి, వేముల శ్రీనివాస్ గౌడ్,ఉప్పల లింగారెడ్డి, బడేకోల్ బాపురెడ్డి, కర్రే చెంద్రయ్య, కర్రే నర్సయ్య, మల్గ ఐలయ్య,దబగుంటపల్లి నుండి కందుల నర్సింహులు, ఇజ్రాయిల్ పార్టీలో చేరారు. కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షుడు గుత్తి సిద్దిరాములు,మాజీ సర్పంచ్ ఆనందం, కొప్పురపు రమేష్ రెడ్డి, రాజేష్, సందీప్ తదితరులున్నారు

