బచ్చన్నపేటలో ఊపందుకున్న కొమ్మూరి ప్రచారం

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి చేతి గుర్తుకు పై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ
బచ్చన్నపేట మండల కేంద్రం మరియు గోపాల్ నగర్, చిన్న రామ మంచెర్ల గ్రామాలలో ప్రచారం నిర్వహించారు ,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మురి ప్రతాప్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ,స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి నిజాయితీగా పరిపాల జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాత్రమే అలాగే అభివృద్ధి జరిగిందంటే అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని
పేద బడుగు బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి పార్టీ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పోటీపడి అబద్ధాలు ఆడారు ఎన్నో అమలు కాని హామీలు ప్రకటించి ప్రజల్ని మోసం చేశారు తెలంగాణ రాష్ట్ర ఇచ్చింది సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అని,బిజెపి పార్టీ అంబానీ ఆదాని కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా పనిచేశారు తప్ప ప్రజలకు లాభం చేకూరే విధంగా పనిచేయలేదుఇక్కడ కేసీఆర్ అనేక అవినీతి, భూకబ్జాలు చేసి అదే విధంగా మంత్రి పదవులు కూడా అమ్ముకొని అనేక విధాలుగా డబ్బులు సంపాదించి ధనిక తెలంగాణని అప్పుల తెలంగాణ గా మార్చాడుమొన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారంటీ పథకాలను ప్రకటించింది అందులో ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగింది కేసీఆర్ 10 ఏళ్ళు అయినా కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదు మొన్న జరిగిన ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు మంచి గుణపాఠం చెప్పారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా భూస్థాపితం చేశారు
రైతు రుణమాఫీ ఒకటి మాత్రమే పెండింగ్లో ఉంది దానిని కూడా ఆగస్టు 15 తారీకు లోపు పూర్తి చేస్తామని రైతుల వ్యతిరేక ప్రభుత్వం అంటే కెసిఆర్ ప్రభుత్వం అక్కడ మోడీ ప్రభుత్వం
ఒక కాలేశ్వరం ప్రాజెక్టులోనే లక్ష కోట్ల అవినీతి చేశారు మన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన యువకుడు ఢిల్లీలో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి కాబట్టి మనకు మంచి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మనందరం కూడా చేతి గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని అన్నారుఈ కార్యక్రమంలో
జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కావ్య రెడ్డి, జిల్లా నాయకులు జంగిటి విద్యనాథ్. ఇజ్జగిరి రాములు, యువ నాయకులు జిల్లా సందీప్, ఎద్దు హరీష్, చెరుకూరి శ్రీనివాస్, మహాత్మ చారి, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,

