మానవతా దృక్పథంతో బాల సదన్ బాలికల ఆశ్రమంలో విద్యార్థినిలకు బుక్స్,స్టేషనరీ, షూస్ వితరణ
— వీవర్స్ కాలనీ లో 25 కేజీల బియ్యం వితరణ
— దాతలు ఇంకా ముందుకు రావాలని పిలుపునిస్తున్న జనగామ అమ్మ ఫౌండేషన్
మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:
పట్టణానికి చెందిన సోప్పరి సత్తయ్య పద్మ రాజేష్ రమ్య లు మానవ దృక్పథంతో సోమవారం జనగామ పట్టణంలోని బాల సదన్ బాలికల ఆశ్రమంలో బాలికలకు స్కూల్ షూస్ బుక్స్ స్టేషనరీ అందించి స్థానిక వివర్స్ కాలనీలో 25 కిలోల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు.ఈ కార్యక్రమాన్ని ముందు నుండి నడిపించిన ఉల్లెంగుల రాజు ని అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ ముఖ్య సలహాదారుడు వంగ భీమరాజ్ అభినందించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన రాజేష్ రమ్య ని అభినందించారు.ఇప్పుడు స్కూల్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జనగామ అమ్మ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలలో భాగంగా దాతలు ముందుకు వచ్చి విద్యా వస్తువుల దానం,బాల బాలికలకు వస్త్ర దానం,స్టేషనరీ బుక్స్,షూస్ అందించి మానవత్వాన్ని చాటుకోవాలని ప్రజలకు యువతకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు గుర్రం నాగరాజు,సుప్రీం,బింగి లక్ష్మణ్,అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు పండుగ నరేష్,బోట్ల సాయి,సల్ల మహేష్,మద్దెల కార్తీక్,బింగి నరసింహులు,కొయ్యడ రవి,అప్పు తదితరులు పాల్గొన్నారు.