Monday, March 2, 2026

రాష్ట్రంలో, దేశంలో గెలుపు మనదే

రాష్ట్రంలో, దేశంలో గెలుపు మనదే

బచ్చన్నపేట పట్టణ అధ్యక్షుడు కోడూరి మహాత్మాచారి

మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం

రాష్ట్రంలో, దేశంలో గెలుపు మనదే అని బచ్చన్నపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి అన్నారు. ఈ సందర్భంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ కాబోయే భారత భవిత ప్రధాని రాహుల్ గాంధీ మాట్లాడుతూ 295 సీట్లు ఇండియా కుటుంబం గెలవబోతున్నారని తెలియజేశారని అదే విధంగా తెలంగాణలో 10 నుండి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా అన్నారు .కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుందని ,ప్రత్యేక గుర్తింపు పార్టీలో ఉంటుందని అన్నారు. ప్రధానిగా రాహుల్ గాంధీని చూడడమే తమ లక్ష్యమని వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెరుకూరి శ్రీనివాస్, మోహన్ రెడ్డి ,దాచేపల్లి రాజయ్య,సిద్ధులు, అఖిల్ మాల తదితరులు పాల్గొన్నారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular