నారాయణపూర్ గ్రామ ప్రజలకు పాదాభివందనాలు

కిసాన్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జంగిటి నరేష్
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలము, నారాయణపురం గ్రామంలో ఈ రోజు వెలువడిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మండలంలో అత్యదిక మెజారిటీ 317 ఓట్లు ఇచ్చిన నా గ్రామ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా అని కిసాన్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జంగిటి నరేష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మురి ప్రతాపరెడ్డి ఎంతో కృషి చేశారని, మండలంలో అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ,మాజీ మార్కెట్ చైర్మన్ మాసపేట రవీందర్ రెడ్డి, నారాయణపురం గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి రాత్రింబవలు కష్టపడ్డ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కూడా ఆనాటి టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తూ విపరితమైన డబ్బు మద్యం తో ప్రలోభాలకు గురి చేసిన కూడా ఏలాంటి ప్రలోభాలకు లొంగకుండా అప్పటి అధికార పార్టీకి దీటుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అపుడు కుడా మండలము లో మూడవ మెజారిటీ ఇచ్చిన గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటు లో ఉంటూ వారికి ఋణపడి ఉంటానని విషయాన్ని వారు తెలియజేసారు.

