కార్యకర్తలు ఆధైర్య పడవద్దు
టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి

మన సాక్షి గొంతుక ప్రతినిధి /బచ్చన్నపేట మండలం
కార్యకర్తలు ఎవరు ఆధైర్య పడవద్దు అని టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , 2001 నుండి ఎన్నో ఉద్యమాలు చేసి, తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మనము అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓటమిలతో ఎవరు కృంగిపోకుండా కార్యకర్తలు ఉండాలని , కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మనకు ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు .రాబోయే ఐదు సంవత్సరాలలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి కృషి చేయాలని కోరారు. ఇలాంటి ఓటములకు ఆధైర్య పడవద్దు అని పిలుపునిచ్చారు.

