ఎంపీ ని కలిసిన మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పడమటికేశవపూర్ మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో కలిసి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చ అందించారు .జరిగిన బోనగిరి ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు .ఈ సందర్భంగా వేణు గౌడ్ ,అఖిల్ మాల, మచ్చ సందీప్, కర్ణాకర్, అభి తదితరులు పాల్గొన్నారు.

