కార్యకర్త కుటుంబానికి అండగా నాగపురి కిరణ్
జనగామ జిల్లా జనగామ మండలం అడవికేశ్వాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ, వ్యక్తిగత ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్..
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ జనగామ
..జనగామ జిల్లా జనగామ మండలం అడవికేశ్వపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా జనగామనియోజకవర్గ కో కన్వీనర్ నాంపల్లి అశోక్ తల్లి మల్లమ్మ ఇటీవల మరణించారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ బాధిత గృహానికి వెళ్లి అశోక్ ను పరామర్శించి, 5,000 రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనగామ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బన్సిలాల్ నాయక్,మండల కాంగ్రెస్ సెక్రటరీ, మాజీ సర్పంచ్ నరేందర్ యాదవ్, మాజీ మండల అద్యక్షుడు మహేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు బాణోతు భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొరబ్ మధు గుప్త, యానాల సిద్దారెడ్డి, చంద్రయ్య,యూత్ నాయకులు బత్తిని నిఖిల్, రమేష్, ఉదయ్, రవి తదితులున్నారు.