సెంట్రల్ బ్యాంకు ను మార్చవద్దు
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు నూకల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యాంక్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ని చౌరస్తా నుండి వేరే చోటు కు మార్చవద్దు అని కోరుతూ,సెంట్రల్ బ్యాంక్ ముందు ప్రజలకు ఖాతాదారులకు అనుకూలంగా ఉండే విధంగా ఉండాలని నినాదాలు చేసి, సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బచ్చన్నపేట మండలం నుండి పలు గ్రామాల ప్రజలు బ్యాంకు అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి వస్తే ఆ బ్యాంకు కిలోమీటర్ దూరం ఏర్పాటు చేస్తే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని, అలాకాకుండా ఇక్కడే బ్యాంకులో సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజలకు బ్యాంకును అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని కోరారు .ఈ కార్యక్రమంలో కిసాన్ స్టేట్ కోఆర్డిటర్ నిడిగొండ శ్రీనివాస్, చెరుకూరి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్, ఎంపిటిసి ఎండి మసూద్, ఎద్దు హరీష్, దాచేపల్లి నర్సింగరావు జంగిటి నరేష్ గుర్రపు బాలరాజు, మట్టి బాలరాజు జింగిడి నరేష్, ఆకిరెడ్డి శ్రీధర్ ,నల్ల మహేందర్, మేకలఉపేందర్ రెడ్డి ,చింతల కర్ణాకర్ ,మహిళా శాఖ జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి కావ్య రెడ్డి, మండల అధ్యక్షురాలు భాగ్య, గుర్రబాలమని తదితరులు పాల్గొన్నారు.