మృతురాలి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్
మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డి పల్లె గ్రామంలో గురుజకుంట బిక్షపతి భార్య ఎల్లమ్మ, అనారోగ్యంతో పరమపదించారని తెలిసి, మాజీ సర్పంచ్ భవాని శశిధర్ రెడ్డి వారి కుటుంబాన్ని ప్రమర్శించి , నిరుపేద కుటుంబం కావడంతో ఎల్లమ్మ అంతక్రియల ఖర్చుల నిమిత్తం 5000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు, అనంతరం వారు మాట్లాడుతూ,వారి కుటుంబానికి తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు,ఈ కార్యక్రమంలో కులం పెద్దమనిషి బంగారు మల్లయ్య, గుడ్ల ఆనందం, కరోబార్ గొల్లపల్లి బాబు, మంగోలు బిక్షపతి, వెల్దండ రవి, ముచ్చనపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.