వ్యవసాయ రుణాలు తీసుకున్న అందరికీ రెండు లక్షల రుణమాఫీ వర్తింప చేయాలి
బచ్చన్నపేట మండల బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు వ్యవసాయ లోన్ తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపచేయాలని బచ్చన్నపేట మండల బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ డిసెంబర్ 9 2023 వరకు ఎలాంటి షరతులు లేకుండా, రేషన్ కార్డుకు సంబంధం లేకుండా ,పాస్బుక్ లకు సంబంధం లేకుండా, బ్యాంకులో రైతులు తీసుకున్న అన్ని రకాల వ్యవసాయ రుణాల మొత్తానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని అన్నారు. వ్యవసాయ పనులు మొదలవుతున్నందున పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా డబ్బులు ఎకరానికి 7500 రైతుల అకౌంట్లోకి జమ చేయాలని డిమాండ్ చేశారు.