కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయం

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 34;
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలంలో ప్రతి గ్రామాన వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులపైకి గుంపులు గుంపులుగా ఎగబడిపోతున్నాయి.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో నిడిగొండ సాయి బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బాలుడిపైకి ఒక్కసారిగా , వీధి కుక్క కాలును కరిచి గట్టిగా పట్టి పీకింది.
బాలుడి అరుపులు కేకలు విన్న స్థానికులు.. వెంటనే బయటికి వచ్చి చూడగా.. కుక్కలు చుట్టుముట్టి కనిపించారు. వెంటనే రాళ్లలో కొట్టి కుక్కలను తరిమేశారు. కాలుకు తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుస దాడులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పిల్లల్ని బయటకు పంపించాటానికే కాదు.. పెద్దోళ్లు ఒంటరిగా వెళ్లటానికి కూడా వణికిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కుక్కల నుండి ప్రజలను కాపాడాలని మీడియా ద్వారా వేడుకుంటున్నారు.

