ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని అల్వాల రాజు అధ్యక్షాన జెండా కార్యక్రమానికి ఘనంగా నిర్వహించ అల్వాల్ రాజు జెండా ఎగరవేయగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పైసా రాజశేఖర్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఈ 30 సంవత్సరాల ఉద్యమ ప్రయాణంలో సమాజానికి అవసరమైనటువంటి ఆరోగ్య శ్రీ వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్ సాధన తెల్ల తెల్ల రేషన్ కార్డ్ బియ్యం పెంపు ఉద్యోగాలలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు వర్గీకరణ సాధించి మాదిగ మాదిగ ఉపకులాలకు 25వేల ఉద్యోగాలు మహిళల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎస్సీ ఎస్టీ అట్రాస్టీ చట్టాన్ని కాపాడడం అనేక సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను చేసి ఈ సమాజానికి సంక్షేమ పథకాలు అందించినటువంటి ఏకైక సంఘం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని మందకృష్ణ మాదిగ నిజాయితీ నిబద్ధత అకుంఠమైనటువంటి పోరాట ఫలితమే ఈ 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమమని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి సీనియర్ నాయకులు నర్సింగరావు మాదిగ, ఎమ్మెస్పీ మండల ఇన్చార్జ్ పాకాల కుమ్మర స్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తుడుం రాజ్ కుమార్ మాదిగ, చింతల మధు కృష్ణ,పైసా ప్రసాద్ మాదిగ, చిల్లపురం శ్రీకాంత్ మాదిగ, కర్రె నవీన్ మాదిగ, కర్రే సిద్ధులు మాదిగ, అల్వాల స్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు