Thursday, November 21, 2024

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన జంగిటి విద్యనాథ్

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన జంగిటి విద్యనాథ్


మన సాక్షి గొంతుక ప్రతినిధి / బచ్చన్నపేట మండలం

జనగామ డిసిసి జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, మండల అద్యక్షులు నూకల బాల్ రెడ్డి అదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ మండల కేంద్రంలో పలు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నారాయణపూర్ గ్రామంలో ఇటీవల విద్యుత్ ఘాతంతో మృతి చెందిన జంగిటీ స్వామీ కుటుంబం నిరుపేద కుటుంబమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ కు మాజీ సర్పంచ్ మాసాపేట రవీందర్ రెడ్డి , నియోజక వర్గ కిసాన్ కో ఆర్డినేటర్ జంగిటీ నరేష్, సమాచారం తెలియజేయడంతో అప్పటికప్పుడు వెంటనే 5000 ఆర్థిక సాయం, వారి ద్వారా ఆ కుటుంబానికి అందజేశారు . 50 కిలోల సన్న బియ్యాన్ని అందజేసిన నారాయణపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు వీలైనంత త్వరగా విద్యుత్ కార్యాలయం నుండి నష్ట పరిహారం అందేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అద్యక్షులు పరిదె శ్రీనివాస్ మాజీ సర్పంచ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి మరియు నియోజక వర్గ కిసాన్ కో ఆర్డినేటర్ జంగిటీ నరేష్, ఉపాధ్యక్షులు ఉపచారీ, పిఎసిఎస్ డైరెక్టర్ రాములు, పరంకుర్ష రావు, యూత్ అద్యక్షులు బండ్రు కరుణాకర్, సిద్దులు, మురళీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular