Thursday, November 21, 2024

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!

మన సాక్షి గొంతుక / బచ్చన్నపేట మండలం

ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్వాల రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నారన్నారు. ఆగస్టు లోపే రెండు లక్షల రుణమాఫీ చేయడం లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని అన్నారు.జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular