Thursday, November 21, 2024

హరీష్ రావు రాజీనామాకు రెడీగా ఉండు

  1. హరీష్ రావు రాజీనామాకు రెడీగా ఉండు

రెండు లక్షల రుణమాఫీ చరిత్రలో నిలిచిపోతుంది


చేర్యాల మార్కెట్ మాజీ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం

రైతన్నకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చిన సందర్భంగా, మొదటగా లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగిందని ,హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆగస్టు 15 లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని ,రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు రాజీనామా చేయడానికి రెడీగా ఉండు అని చేర్యాల మార్కెట్ మాజీ చైర్మన్ మాసపేట రవీందర్ రెడ్డి అన్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమం అని అన్నారు. బచ్చన్నపేట రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ అమలు చేస్తుందని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో రుణమాఫీని ఏడాదికి 25వేల చొప్పున నాలుగు విడతలుగా లక్ష రూపాయలు మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరో సారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ రుణమాఫీ అమలు చేయలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెట్టినప్పటికీ రుణమాఫీని అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, గత పాలకులు కాంగ్రెస్ అమలు చేస్తున్న రుణమాఫీ పై అవాక్కులు చెవాకులు పేల్చడం, అభాండాలు మోపే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఆగస్టు 15లోగా మిగతా లక్ష రూపాయలు రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒకేసారి రూ.రెండు లక్షలు రుణమాఫీ చేయడం ఆర్థిక భారం అయినప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
తెలుపు రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ అమలు చేస్తారని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకానికి ఇప్పటివరకు రూ.635 కోట్ల 52 లక్షలు విద్యుత్ సంస్థలకు చెల్లించిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఏడు నెలల కాలంలో 40 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి రూ.280 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రైతు రుణమాఫీని పండుగ వాతావరణంలో గ్రామ గ్రామాన రైతులు రుణమాఫీ పండుగను నిర్వహించాలని కోరారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular