కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షునిగా కూరాకుల రవి

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కూరాకుల రవిని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షునిగా నియమించినట్లు ఆ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నునావత్ సుమన్ నాయక్ తెలిపారు. శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా జనగామ జిల్లా ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ గా కూరాకుల సుభాష్, బచ్చన్నపేట మండల ఉపాధ్యక్షులుగా మానుపాటి యాదగిరి, చావన్ రమేష్, కోఆర్డినేటర్లుగా ఉపేందర్, రాంనర్సయ్య ,నర్సింలు ,నెంబర్లుగా లక్ష్మణ్, రమేష్ ,హరికృష్ణ లను నియామక పత్రాన్ని అందజేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో చురుకైన వ్యక్తిగా కొనసాగినందున అతని గుర్తించి ఎస్టీ సెల్ మండల అధ్యక్ష పదవిని కట్టబెడుతున్నామని అన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు నూతన ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు కూరాకుల రవి మాట్లాడుతూ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తల అభివృద్ధి కోసం మరియు కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అందరు కలుపుకొని ముందు పోయి పార్టీ అభివృద్ధికి సేవ చేస్తారని తెలిపారు. నా నియమకానికి సహకరించిన, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ సందర్భంగా మాసాపేట రవీందర్ రెడ్డి ,జిల్లా సందీప్, అల్వాల ఎల్లయ్య, చెరుకూరి శ్రీనివాస్ ,గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మ కరుణాకర్ రెడ్డి ,దాసరి శ్రీనివాస్ రెడ్డి , జంగిలి స్వామి, హరికృష్ణ, అశోకు, కొండయ్య, జంగిటి సిద్ధులు, తదితరులు పాల్గొన్నారు.

