మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కు సన్మానం

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీసుగా విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ రాజు కొడకండ్ల పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ అయినందున బచ్చన్నపేట మండల మాజీ సర్పంచులు వారికి శాలువతో సన్మానించి వీడ్కోలు పలికారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బచ్చన్నపేట మండలంలో ఫ్రెండ్లీ పోలీసుకు నిర్వచనం రాజు కానిస్టేబుల్ అని వారు ఇక్కడినుండి బదిలీపై వెళ్లడం బాధాకరమైన విషయమైనా వారు ఎక్కడ ఉన్నా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు బాల్రెడ్డి, వడ్డేపల్లి మల్లారెడ్డి, మూషిని సునీత రాజు, కవిత రాజ నరసయ్య, పర్వతం మధు ప్రసాద్ ,కోనేటి స్వామి, ఖలీల్ బేగం అజాం, భవాని శశిధర్ రెడ్డి ,టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి, ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.

