సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన నాగపురి కిరణ్
పేదలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రజాప్రభుత్వం.. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్..

మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ నియోజకవర్గం , బచ్చన్నపేట మండలం , ఇటిక్యాలపల్లి గ్రామ నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందిన కొలుగూరి రామచంద్రయ్య కు వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చుకాగా, ఇట్టి విషయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి రాగా, వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ నిధి నుండి 58,500 రూపాయలను మంజూరు చేయించడం జరిగింది. ఇట్టి మంజూరైన చెక్కును బాధితుని కుటుంబ సభ్యులకు వారి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేయించిన నాగపురి కిరణ్ కుమార్ కి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు బిఎ లింగం, బైరగోని కనకయ్య గౌడ్, కొలుగూరి రాములు మాజీ ఎంపీటీసీ నేరెళ్ల రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మ్యాక కిష్టయ్య గ్రామ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల రాజు, నాయకులు బోడిగం చంద్రారెడ్డి, గొరుగు మల్లేశం, నాగమల్ల స్వామి, కోటగిరి అంజయ్య, కొలుగూరి భైరగోని మల్లేశం, యూత్ నాయకులు బండారి సతీష్,రాజుగౌడ్, ఉదయ్, నరేందర్ తదితరులు పాల్గోన్నారు.

