నేడు( బుధవారం రోజున) చేనేత దినోత్సవం
పద్మశాలి నాయకులు కదలిరండి
చేనేత దినోత్సవం సందర్భంగా జనగామలో ర్యాలీ

మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట /జనగామ
జనగామ జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి కలెక్టరేట్ ఆఫీస్ వద్ద వరకు పద్మశాలి నాయకుల ఆధ్వర్యంలో, బుధవారం రోజున ఉదయం 9 గంటలకు జరుగుతున్న ర్యాలీకి బచ్చన్నపేట మండల పద్మశాలి నాయకులు ప్రజలు కదిలి రావాలని , సిద్దేశ్వర సిల్క్స్ సొసైటీ
చైర్మన్ బేతి విమల కృష్ణమూర్తి, కార్యదర్శి గణపురం నాగేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం రోజున జాతీయ చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు. అలాగే కలెక్టరేట్లో జరిగే సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు పాణికంటి జనార్దన్ పాల్గొన్నార, గోల్డ్ శ్రీహరి మంగళపల్లి సత్యనారాయణ వల్లాల శ్రీనివాస్ వేముల వెంకటేశం మచ్చ నరేందర్ మంగళపల్లి కృష్ణమూర్తి గుండ కేశవులు గడ్డం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

