యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బచ్చన్నపేట పట్టణంలో శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ బచ్చన్నపేట పట్టణాధ్యక్షుడు పోచంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ , యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ జెండాను ఎగరేశారు అనంతరం అనంతరం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలో యువజన కాంగ్రెస్ నుండి అనేకమంది దేశ గొప్ప నాయకులుగా అవతరించారని యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ లో ముఖ్య భూమిక పాత్ర పోషించే వ్యవస్థ లాగా తయారయ్యిందని ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థగా అవతరించినది అని యువజన కాంగ్రెస్లో సభ్యులైనందుకు మేమందరం గర్వపడుతున్నామని పేర్కొన్నారు ఇలాగే దేశంలోని రాష్ట్రంలోని యువకులు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజిని ఫాలో అయ్యి దేశాన్ని ఒక ఉన్నత శిఖరానికి చేసే ప్రయోగంలో పాలుపంచుకోవాలని వారు పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా పడమటి కేశపూర్ మాజీ సర్పంచ్ గిద్దల రమేష్ బాలకిషన్ గౌడ్, మండల మాజీ అధ్యక్షుడు వంచ వెంకటరెడ్డి, జిల్లా సందీప్ ,జిల్లా రాజయ్య, మహాత్మ చారి ,చెరుకూరి శ్రీనివాస్ ,ఎండి గౌస్, దాచేపల్లి రాజయ్య, గని గౌడ్ ,గంగరబోయిన మహేందర్, కంఠం కరుణాకర్, కర్రె నరేష్, కురాకుల రవి, సుభాష్, అఖిల్ మాల, అభి ,పట్టణ మహిళా అధ్యక్షురాలు నీల కృష్ణవేణి కృష్ణవేణి, తదితర యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

