సైబర్ మోసం……….
— సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 11 లక్షలు పోగొట్టుకున్న జనగామ వాసి….

మన సాక్షి గొంతుక న్యూస్/జనగామ:
కాలానుగుణంగా మారుతున్న డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. వాట్సాప్ వేదికగా చేసుకుని నేరగాళ్లు లక్షలు కాజేస్తున్నారు.ప్రభుత్వం రైతు ఋణమాఫీ అమలు చేస్తున్న సందర్బంగా ఇదే అదునుగా భావించి బ్యాంక్ ఏపీకే యాప్ ల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో బ్యాంక్ ల,క్రెడిట్ కార్డుల పేరుతో వాట్సాప్ ను హ్యక్ చేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు.ఇలాంటి సంఘటనే శనివారం జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే జనగామ పట్టణానికి చెందిన ఆర్టీసీ డిపో కండక్టర్ పోలోజు
రామేశ్వర్ చారి కి యూనియన్ బ్యాంక్ పేరుతో ఏపీకే
అప్లికేషను పంపి ఈ మోసానికి ఒడిగట్టారు.అయితే యాప్ డౌన్లోడ్ చేసుకున్న క్షణాల్లోనే,అతని సిమ్
కార్డ్ను హ్యాక్ చేసి విడతలవారీగా అకౌంట్ నుంచి
అమౌంట్ని దోచేసినట్లు బాధితుడు తెలిపారు.1930 సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.వాట్సాప్ లో అనుమానిత యాప్ లు,తెలియని కాంటాక్ట్ నుండి వచ్చిన మెసేజ్ లింక్ లు ఓపెన్ చేయొద్దని పోలీసులు తెలిపారు.హ్యాక్ అయినట్లు సందేహం ఉండి,ఇబ్బందులు, అనుమానాలు తలెత్తితే వెంటనే సైబర్ క్రైమ్ నెంబర్ 1930 కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలని కోరారు.

