Monday, March 2, 2026

బచ్చన్నపేటలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

బచ్చన్నపేటలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండల కేంద్రంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, వద్ద జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలు,నాయకుల మధ్య స్వర్గీయ రాజీవ్ గాంధీ 80 జయంతి వేడుకలను ఘనంగా జరిపారు.రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేయడం జరిగిందన్నారు.
కంప్యూటర్లు,సెల్ ఫోన్లు, టెలికాం,ఐటీ రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నేత,దేశం కోసం ప్రాణన్ని త్యాగం చేసిన నాయకుడని తెలిపారు.ఆయన ఆశయాల కొరకు ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం సాధించుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలను అమలు చేసి ఇది ప్రజల ప్రభుత్వం రైతన్న ప్రభుత్వమని అన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ మాసపేట రవీందర్ రెడ్డి,, మండల సీనియర్ నాయకులు ఎండి మసూద్, అల్వాల రాధా ఎల్లయ్య,మండల యువ నాయకుడు జిల్లా సందీప్  నారాయణరెడ్డి,చెరుకూరి శ్రీనివాస్ , దాచేపల్లి నర్సింగరావు, సీనియర్ నాయకులు వేముల వెంకట్ గౌడ్ ,అంబాల ఆగయ్య, గుర్రపు బాలరాజు, సందెల రాము, కొండ హరికృష్ణ, వేముల భద్రయ్య ,జంగిలి స్వామి గార్లపాటి మహిపాల్ రెడ్డి, జ్యోతి భాస్కర్ ,కోక్కల కొండ బాబు, వేముల వెంకటేష్ ,ఆరేళ్ల భాస్కర్ , కనకరాజు ,చింతల కరుణాకర్, మహిళా కార్యకర్తలు బొమ్మెర్ల వేణు వందన ,బుర్ర బాలమని, నీల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular