పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
మనసాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట పట్టణ అధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి ఆధ్వర్యంలో బచ్చన్నపేట చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాజీవ్ గాంధీ గారి ముందుచూపు వల్లే భారతదేశం ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పటిష్టంగా మారిందని, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్, యువతకు 18ఏండ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి నిర్ణయాలు కూడా రాజీవ్ గారి హయాంలో తీసుకున్నవే అని గుర్తుచేశారు.
యువతకు ఆదర్శపాయుడైన రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడని, అలాంటి స్ఫూర్తిమంతమైన నాయకుడి విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రతిష్టించుకోవడం ఎంతైనా సముచితమని, రాజీవ్ గాంధీ ఆశయాల మేరకు యువతను అన్ని రంగాల్లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం తలపెట్టిందని, అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నల్లగోని బాలకిషన్ గౌడ్,టౌన్ ఉపాధ్యక్షులు లక్కర్స్ వెంకటేశ్వర్లు గంధమల కిష్టయ్య , యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు, ఎండి యూసుఫ్, ఎద్దు నాగయ్య ,శ్రీనివాస్ అల్వాల ఉప్పలయ్య, పెంటయ్య, బాలరాజు ,మోహన్ రెడ్డి, భాస్కర్, నర్సింగరావు, కూరాకుల రవి, నర్సిరెడ్డి, జార్జ్ , కిషన్, యాదగిరి, లక్ష్మణ్, పాలరాజు ,అంకిల్, చెరుకురిశ్రీనివాస్,బుచ్చిరాజు ,కృష్ణవేణి, వేణు వందన, గంగరబోయిన మహేందర్ ,ఎండి అసిఫ్ ,నీల మల్లేశం ,భాష ,నరేష్, తరుణ్, శ్రీకాంత్ ,పోచంపల్లి శ్రీనివాస్, భానుచందర్, రాజు ,ప్రశాంత్ ,వివేక్, అజయ్, సంజయ్, ఎద్దు రఘు ,బాల్రెడ్డి